హైదరాబాద్: బాలీవుడ్ నటి కంగన రనౌగ్‌పై ముంబై హైకోర్టు సోమవారం బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ జావేద్ అక్తర్ నమోదు చేసిన కేసు నేపథ్యంలో ఈ వారెంట్ జారీ చేసినట్లు కోర్టు వెల్లడించింది. ఆమెపై కొద్ది నెలల క్రితం జావేద్ అక్తర్ పరువునష్టం దావా వేశారు.ఈ కేసును గత నెల 1న విచారించిన అంధేరీలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ మార్చి 1వ తేదీలోగా కోర్టు ముందు హాజరు కావాలని కంగనను ఆదేశించింది. కానీ సోమవారంతో గడువు ముగిసినప్పటికీ కంగన హాజరు కాలేదు. దీంతో ఆమె కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు భావించిన కోర్టు.. ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే ఈ వారెంట్ బెయిలబుల్ వారెంట్ అని ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా తదుపరి విచారణను మార్చి 26కు వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm