నవతెలంగాణ కంటేశ్వర్
కోవిడ్ నియంత్రణలో భాగంగా 45 సం పైబడిన వారికి కోవిడ్ టీకా ఇచ్చే మహత్తర కార్యక్రమానికి సోమవారం మెడికవర్ హాస్పిటల్స్ - నిజామాబాద్ వారు శ్రీకారం చుట్టారు. 45 సం మొదలుకొని 80 సం వయసుకలిగినవారు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 80 సంవత్సరాల వ్యక్తికూడా కోవిడ్ డోసు తీసుకోవడానికి ముందుకు రావడం గమనార్హం. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ లో కోవిడ్ టీకాను తీసుకున్నారు.ఈమె వయస్సు 80 ఏళ్లు. కోవిడ్ టీకా తీసుకొని నాణ్యమైన జీవితాన్ని ఆనందించడానికి తాను ఎన్నో రోజులుగా ఎదుచూస్తున్నానని,టీకా తీసుకోవడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని ఆమె అన్నారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య అధికారి సుదర్శనం మెడికవర్ ఆసుపత్రి లోని వాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు పరిశీలించి పలు సూచనలు సలహాలు ఇచ్చరు ... కోవిడ్ టీకా తీసుకుంటే ఆరోగ్యపరమైన అనర్దాలు ఉంటాయనే తప్పుడు ప్రచారం బయట ఉందనీ, అవన్నీ వట్టి వదంతులే తప్ప నిజాలు కావని అయన అన్నారు . మనకోసం , మన కుటుంబం కోసమే కాకుండా ,సామజిక స్పృహ దృష్ట్యా కూడా కోవిడ్ టీకా తీసుకోవడం శ్రేయస్కరం అన్నారు .వీరితో పాటు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ రమేష్ రాథోడ్, రాజేష్ ఆసుపత్రి మేనేజ్మెంట్ పాల్గొన్నారు. మొత్తం 12 మంది వరకు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Mar,2021 07:31PM