హైదరాబాద్: ఏటీఎంలో నగదును దోచుకెళ్లాలని నలుగురు సభ్యుల ముఠా పథకం వేసింది. అయితే ఏటీఎంను బద్దలు కొట్టడం వారి వల్ల కాలేదు. దాంతో ఏటీఎంనే ఎత్తుకుపోయారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్ సమీపంలోని పెరియపాలెంలో జరిగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు ఏటీఎంను తాడుతో కారుకు కట్టి పెకిలించడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కొంతదూరం వెళ్లాక ఆ వాహనాన్ని దొంగల ముఠా వదిలేసింది. ఆ ఏటీఎంలో రూ.2 లక్షల నగదు ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm