హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిజాయతీగా పనిచేసే వారిని గెలిపించాలని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో మాదిరిగానే నడిగడ్డకు చెందిన పట్టభద్రులు తమపై ఆదరాభిమానాలు చూపించాలని ఆయన కోరారు. పీఆర్టీయూలో ఉన్నప్పుడు చాలామంది తనకు అండగా నిలిచారని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. పట్టభద్రులు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సమస్యనూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm