న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఇప్పుడు కర్షియల్ గ్యాస్ సిలిండర్ వంతు వచ్చింది. గత వారంలో సబ్సిడీ గ్యాస్ ధరలను పెంచిన చమురు కంపెనీలు.. ఇవాళ వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరను పెంచాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.95 వడ్డించాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1614కు చేరింది. పెంచిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని పెట్రో కంపెనీలు ప్రకటించాయి. ఫిబ్రవరిలో ఏకంగా 16 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. అదేవిధంగా గృహావసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను మూడుసార్లు సవరించాయి. దీంతో ఒక్క నెలలోనే సిలిండర్ ధర రూ.100 అధికమయ్యింది.
Mon Jan 19, 2015 06:51 pm