హైదరాబాద్: సైనికుడి భార్య, కుమార్తె రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్ లోని విరింజిపురం సమీపం కీల్విలాచూర్కు చెందిన రాజేష్‌కుమార్ (44) మేఘాలయలో సైనికదళంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య జయంతి (30), కుమారుడు తరుణ్ కుమార్ (7), కుమార్తె నందిని (4)లు కీల్విలాచూర్లో నివాసం ఉంటున్నారు. రాజేష్ ఈనెల 2న సెలవుపై ఇంటికొచ్చాడు. కొత్తగా నిర్మించుకున్న గృహప్రవేశం వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో, ఆదివారం ఉదయం భార్య, కుమార్తె కనిపించకపోవడంతో రాజేష్ వారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. విరింజిపురం రైలుపట్టాలపై ఇరువురు శవాలుగా పడి వుండడం చూసి దిగ్ర్భాంతి చెందాడు. సమాచారం అందుకున్న జోలార్‌పేట రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని, ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యల కారణంగా వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm