హైదరాబాద్: నేటి నుంచి గ్రేటర్‌లో రెండో దఫా టీకా ప్రారంభం కానుంది. 60 ఏళ్ల వయస్సు దాటిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వారికి కూడా కరోనా టీకా వేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఫార్మాట్‌తో కూడిన కొ-విన్ యాప్‌ను ఏర్పాటు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రతిరోజు 200 మంది సాధారణ ప్రజానికానికి కరోనా టీకా పంపిణీ చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరితో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్స్, ఆరోగ్య కార్యకర్తలకు సెకండ్ డోస్ టీకా పంపిణీ కూడా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 18 ఏళ్ల వయస్సుపై బడిన సాధారణ ప్రజానీకం అందరికీ టీకా వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm