హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డలో ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు 125 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ సీఐ రవికుమార్, సిబ్బందితో కలిసి గ్రామంలో దాడులు నిర్వహించారు. రెండు వాహనాలను గుర్తించి తిరుమలాయపాలెం పోలీసులకు అప్పగించారు. వాహన డ్రైవర్లు నాగరాజు, వాంకుడోత్ శివలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలకృష్ణ, అప్పారావు, సైదులు అనే వ్యక్తులు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm