పుణె: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాత్రి పూట కర్ఫ్యూని మార్చి 14 వరకు పొడిగించాలని మహారాష్ట్రలోని పుణె జిల్లా అధికారులు నిర్ణయించారు. అత్యవసర సేవలను మాత్రం ఈ కర్ఫ్యూ నుంచి మినహాయించారు. నిజానికి ఇవాళ్టి (ఫిబ్రవరి 28)తో ఈ కర్ఫ్యూ ముగియాల్సి ఉన్నా.. దానిని మరో 15 రోజులు పొడిగించారు. అప్పటి వరకూ స్కూళ్లు, కాలేజీలు కూడా మూసే ఉంటాయని పుణె మేయర్ మురళీధర్ మోహోల్ వెల్లడించారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. పుణెలో ఇప్పటి వరకూ మొత్తం 4 లక్షల 6 వేల కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 9860 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm