హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ చేశారు. సంక్షేమ పథకాల విషయంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే ఇకపై ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కూడా ఇదే వర్తిస్తుందని, పార్టీని రక్షించుకోవడానికి ఇదే మంచి మార్గం అని రాజయ్య పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాజయ్య స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గంలోని గ్రామాల్లో పర్యటించారు. సభ్యత్వ నమోదు పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై టీ =ఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Mon Jan 19, 2015 06:51 pm