హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద కారు ఢీకొని బాలుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm