హైదరాబాద్ : అప్పు తీర్చడంలేదనే కారణంలో ఓ వ్యక్తిపై అతని స్నేహితులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కుల్సుంపురలోని సన్‌సిటీకి చెందిన శ్రీనివాస్‌పై అతని స్నేహితులు శనివారం రాత్రి కత్తితో దాడికి పాల్పడ్డారు. పాత బస్తీకి చెందిన ఫెరోజ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి శ్రీనివాస్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడు గతంలో ఫెరోజ్ వద్ద డబ్బులు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. తిరిగి చెల్లించనందువల్లే అతడిపై దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Feb,2021 12:29PM