హైదరాబాద్ : నగరంలో బిర్యానీకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే బిర్యానీ తినాలనే వారికి శుభవార్త. ఇప్పటివరకు పెద్ద హోటళ్లలో లభ్యమయ్యే బిర్యానీ తినాలంటే భారంగా ఉన్న వారికి.. రూ.60కే వేడివేడిగా ‘తిన్నంత బిర్యానీ’ పెడుతున్నారు. ఉప్పల్ చౌరస్తా నుంచి రామంతాపూర్‌కు వెళ్లే మార్గంలో ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్ కనిపిస్తుంది. ఒక్కో దాని ధర రూ.60. ఇష్టమున్నంత తినొచ్చు. పూర్తిగా శాకాహారం మాత్రమే. బిర్యానీతోపాటు అదనంగా గ్రేవీ, సలాడ్, పెరుగు, స్వీట్, మినరల్ వాటర్ ఇస్తారు. నాలుగురోజుల క్రితమే దీన్ని ఏర్పాటు చేశారు. అన్నదమ్ములైన ఉదయ్, కిరణ్‌లు.. తక్కువ ధరకే బిర్యానీకి అందిస్తున్నారు. బిర్యానీపై మోజు ఉన్నవారు తిన్నంత బిర్యానీని ఆదరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్-రామంతాపూర్ మార్గంలో రూ.60 చెల్లించి ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్‌లో భోజనప్రియులు బిర్యానీని తింటూ ఆస్వాదిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm