హైదరాబాద్ : మహబూబ్నగర్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్నగర్ పట్టణంలో గత రెండు నెలల నుంచి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి ఉంచిన బైక్లనే వారు లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూ ఉండేవారని పోలీసులు పేర్కొన్నారు. వారి దగ్గర ఎక్కువ సంఖ్యలో వివిధ రకాల బైక్లు ఉన్నట్లు సమాచారం రావడంతో విచారణ చేపట్టామని... దీంతో చోరీ వ్యవహారం బయటపడిందని పోలీసులు వెల్లడించారు. ఆ మూఠా 15 మోటర్ సైకిళ్లను దొంగలించగా.. 8 లక్షల విలువైన 14 మోటార్ సైకిళ్లను, మరో బైక్కు సంబంధించి 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. చోరీ చేసిన బైక్లను తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యక్తులపై కూడా.. కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. పరారీలో ఉన్న వారిని సైతం పట్టుకుని రిమాండుకు తరలిస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Feb,2021 09:47PM