హైదరాబాద్: కష్టపడి చదివి చిన్న వయసులోనే సివిల్ జడ్జిగా ఎంపికైంది ఓ యువతి. ఆమె పేరే చేతన. 2020లో కర్ణాటక హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది చేతన. తర్వాత 2021 ఫిబ్రవరి 25న విడుదలైన నోటిఫికేషన్లో కర్ణాటక సివిల్ జడ్జిగా ఎంపికైంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. చదువు విలువ తెలిసిన ఆ తల్లితండ్రులు తమ పిల్లలను చదివించేందుకు వెనకడుగువేయలేదు. దీనికి ఫలితమే నేడు దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల గ్రామానికి చెందిన చేతన(29) కర్ణాటక సివిల్ జడ్జిగా ఎంపికైంది. తల్లితండ్రుల ప్రోత్సాహమే తన విజయమని గర్వంగా చెబుతుంది ఆమె. గ్యాడ్యుయేషన్ వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించిన చేతన.. మంగళూరులోని శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కళాశాలలో లా కోర్సును పూర్తిచేసింది. తర్వాత లాయర్గా జీవితాన్ని ప్రారంభించింది. మూడేళ్ల పాటు కర్ణాటక హైకోర్టు జడ్జి బీఏ పాటిల్ దగ్గర క్లర్క్ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేసింది. తర్వాత శివప్రసాద్ శంతనగౌడర్ అనే లాయర్తో జూనియర్ లాయర్గా పనిచేసింది. ఆ తర్వాత సివిల్ జడ్డి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.
Mon Jan 19, 2015 06:51 pm