హైదరాబాద్ : కోర్టు కేసుల్లో ఉన్న వివాదాస్పద స్థలంలో నిర్మాణం చేపడుతోన్న నిందితులపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఓ మహిళ.. అదృశ్యమైంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో జరిగింది. వివరాల ప్రకారం.. ఈస్ట్ ఆనంద్బాగ్కు చెందిన గీతా రాణి అనే మహిళ... ఇంటి పక్కన ఉన్న వివాదాస్పద స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులును ఆశ్రయించారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm