హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భార్యను, పోలీసులను బెదిరించేందుకు ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల ప్రకారం.. అబ్బనికుంటకు చెందిన హరికృష్ణ.. రోజూ మద్యం తాగి వచ్చి తన భార్య వనజను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇబ్బందులు భరించలేక వనజ.. స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో హరికృష్ణపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు.. అతడిని స్టేషన్ కు రావాలని చెప్పడంతో.. ప్లాన్ ప్రకారం ఫుల్లుగా మద్యం తాగా ఆటోలో స్టేషన్ కు వచ్చాడు. అనంతరం రోడ్డు మీదే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని బాధితుడు కిందపడి కేకలు పెట్టాడు. దీంతో పోలీసులు బాధితుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm