హైదరాబాద్ : మహారాష్ట్రలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల నమోదు ఎక్కువగా ఉన్న అమరావతి జిల్లాలో లాక్‌డౌన్‌ను మార్చి 8 వరకు పొడిగించారు. ఈ జిల్లాలోని అమరావతి నగరం, అచల్‌పూర్ పట్టంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నది. దీంతో ఈ నెల 21 నుంచి వారం రోజులు లాక్‌డౌన్ విధించారు. నిత్యవసరాల షాపులు తప్ప అన్నింటిని మూసివేశారు. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టలేదు. దీంతో పరిస్థితిలో మార్పు రాకపోవడంతో అమరావతి నగరం, అచల్‌పూర్ పట్టణంలో లాక్‌డౌన్‌ను మార్చి 8 వరకు పొడిగించారు. అంజంగావ్ సుర్జీ గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న అకోలా, వాషిమ్, బుల్ధనా, యావత్మల్ ప్రాంతాల్లో కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 21 లక్షలు, మరణాలు 52 వేలు దాటాయి.
Mon Jan 19, 2015 06:51 pm