హైదరాబాద్ : తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అలిపిరిలో ఓ భక్తుడు గుండెపోటుతో మరణించాడు. దాంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. హైదరాబాద్ కు చెందిన రాహుల్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి తిరుమల శ్రీవారి సందర్శన నిమిత్తం తిరుపతి చేరుకున్నాడు. అయితే మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో అలిపిరి మెట్ల మార్గంలోని గాలిగోపురం వద్దకు చేరుకోగానే గుండెపోటుకు గురయ్యాడు. దాంతో ఇతర భక్తులు అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే రాహుల్ మరణించినట్టు తెలుస్తోంది. కాగా, ఆ విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm