హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని అన్నారు. మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు చేపట్టాలని, ప్రణాళిక ప్రకారం వ్యాక్సినేషన్ జరగాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు రాజీవ్ గౌబా సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 0.43 శాతంగా ఉందని పేర్కొన్నారు. 1100 ప్రాంతాల్లో యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, కోవిడ్ బాధితులకు వెంటనే ఔషధాలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 75శాతం మంది వైద్యారోగ్య సిబ్బందికి టీకాలు అందజేశామన్నారు. మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm