మహబూబ్‌నగర్: జడ్చర్ల మండలం లింగపేటలో విషాదం చోటుచేసుకున్నది. జీవితంపై విరక్తి చెందిన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. లింగంపేటకు చెందిన శివలింగం (24) డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొన్నాడు. జీవితంపై విరక్తితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో వెల్లడించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm