హైదరాబాద్: దేశ ప్రజలు, పార్టీలు, నేతలు ఎవరు ఎంత గగ్గోలు పెట్టినా మా రూల్ మాదే అంటున్నాయి చమురు కంపెనీలు. అంతర్జాతీయ చమురు ధరలకు తగ్గట్టుగా తాము ధరలను సవరించక తప్పదంటున్నాయి. కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో... ధరలు భగ్గుమంటున్నాయి.
హైదరాబాద్‌లో పెట్రోల్ 25 పైసలు పెరిగి లీటర్ రూ.94.79కి చేరగా, డీజిల్ ధర 17 పైసలు పెరిగి లీటరుకు రూ.88.86కు చేరింది. విజయవాడలో పెట్రోల్ లీటర్ 97.00కి చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.90.55కి చేరింది. ఢిల్లీలో పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి లీటర్ రూ.91.17కి చేరింది, డీజిల్ కూడా 15 పైసలు పెరిగి లీటర్ రూ.81.47కి చేరింది. ముంబైలో పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి... లీటర్ రూ.97.57కి చేరింది. డీజిల్ 16 పైసలు పెరిగి లీటర్ రూ.88.60కి చేరింది.
సాధరణ పెట్రోల్ ధర ఇలా ఉంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 100 అక్టాన్ ప్రీమియం పెట్రోల్‌ను హైదరాబాద్‌లో లాచ్ చేసింది. దాని ధర లీటర్ రూ.160. పెట్రోల్ ధర ఎంత పెరిగినా పర్వాలేదు అనుకునేవారు ఈ పెట్రోల్ కొనుక్కోవచ్చేమో. ఇది ఇంత రేటు ఎందుకు అంటే అది మామూలు పెట్రోల్ కాదనీ ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ అని కంపెనీ చెబుతోంది. ఈ పెట్రోల్ వల్ల ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుందనీ డ్రైవింగ్ కూడా స్మూత్‌గా ఉంటుందని చెబుతోంది.
ఈ వరల్డ్ క్లాస్ పెట్రోల్‌ని ఐఓసీ ఇంతకుముందు ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఆగ్రా, జైపూర్, ఛండీఘర్, లూథియానా, ముంబై, పుణె, అహ్మదాబాద్‌లో గత డిసెంబర్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్‌లోకీ వచ్చేసింది. హైదరాబాద్‌లో ఈ పెట్రోల్ అమ్మాలు ప్రారంభించిన్నపట్పి నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. రోజూ ఆయా బంకుల్లో 200 నుంచి 300 లీటర్లు అమ్ముడవుతోందట. సాధారణ పెట్రోల్ బదులు ఇది వాడితే వెహికిల్స్‌కి మంచిదని అంటోంది. BS6 వాహనాలకు ఇది సెట్ అయ్యే పెట్రోల్ అని నిపుణులు అంటున్నారు. పర్యావరణానికి కూడా మంచిదంటున్నారు. సామాన్య ప్రజలు మాత్రం దీన్ని స్వాగతించట్లేదు. ఇలాంటి పెట్రోల్ అమ్మితే... సాధారణ పెట్రోల్ ధరలు ఇంకా పెంచేస్తారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Feb,2021 10:10AM