హైదరాబాద్: పంజాబ్ బర్నాలా జిల్లాలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల యువతిని బంధించి, కొందరు కిరాతకులు 8 నెలలు లైంగికదాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మహిళలు సహా ఏడుగురుపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముగ్గురు పోలీసులు కూడా బాధితురాలిని బెదిరించారనే ఆరోపణతో సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆ యువతి.. బర్నాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఘటనకు సంబంధించి బాధితురాలు నుంచి వాగ్మూలం నమోదు చేశారు మేజిస్ట్రేట్.
"ఆ యువతి.. 2020 జూన్‌లో జిరాక్సుల కోసం బయటకు వెళ్లింది. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళ.. తన అత్తగారింటికి ఆ యువతిని తీసుకెళ్లింది. అప్పటికే ఆ ఇంటి వద్ద పురోహితుడు సహా 20-25 మంది ఉన్నారు. ఇంటికి వచ్చిన అతిథికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చింది. దీంతో సృహకోల్పోయిన ఆ యువతిపై పురోహితుడితో పాటు పలువురు లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత ఆ యువతిని అక్కడ నుంచి బర్నాలలోని పాంధర్ గ్రామానికి తీసుకెళ్లి ఆమెను బందీగా చేశారు. సస్పెండ్ అయిన పోలీసు అధికారులు కూడా అప్పుడప్పుడు ఆమెను సందర్శించేవారు. ఆ సమయంలో ఆమెను ఇంజెక్షన్లు ద్వారా అపస్మారక స్థితిలో ఉంచేవారు. కొన్ని రోజుల తర్వాత బాధితురాలిని ధూరి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బతిండాకు తీసుకువెళ్లారు. ఒకానొక దశలో బాధితురాలిని రూ.3 లక్షలకు అమ్మే ప్రయత్నం కూడా చేశారు. అయితే అతి కష్టం మీద ఆ కిరాతుకులు నుంచి బాధితురాలు బయటపడింది. ఈ ఘటనపై.. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బర్నాలా డీజీపీ లఖ్వీర్ సింగ్ తివానా తెలిపారు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళే.. తన కుమార్తెను అపహరించిందని బాధితురాలి తల్లి ఆరోపించింది. దీంతో ఆ మహిళలను అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Feb,2021 08:26AM