- బీజేపీ పాలనలోమహిళలపై పెరిగిన హింస
- హైకోర్టు న్యాయవాది హేమలలిత
హైదరాబాద్: బీజేపీ పాలనలో మహిళలపై హింస చెలరేగుతుందని, ప్రాథమిక రక్షణ కూడా లేదని హైకోర్టు న్యాయవాది హేమలలిత అన్నారు. శుక్రవారం చిక్కడపల్లి కేవీపీఎస్ రాష్ట్ర ఆఫీసు లో కేవీపీఎస్ మహిళా విభాగం సమావేశం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల లలిత అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన హైకోర్టు న్యాయవాది హేమలలిత, తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం రాష్ట్ర కార్యదర్శి కె హిమబిందు మాట్లాడుతూ బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ దృష్టిలో మహిళలు రెండవ శ్రేణి పౌరులని, మనుషులంతా సమానం అనే దానికి అది వ్యతిరేకమని భర్త చెప్పుచేతల్లో బందీగా ఉండాల్సిందేనని, వంటిశీటి కుందేలులా పడిఉండేలా మానసిక చట్టాలు రూపొందించారని విమర్శించారు. సమాజం లో సగభాగం ఉన్నమహిళలకు చట్టసభల్లో సగం ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకపోవడంతో గౌరీ లంకేశ్, మనీషా వాల్మీకి, అసిఫా వంటి ఎందరినో కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అందరూ మహిళలతోపాటు దళిత మహిళలు సామాజిక అణిచివేత ను అదనంగా నుభవిస్తున్నారని చెప్పారు. మహిళా చట్టాలు అమలుకు నోచుకోకపోవడం వల్ల మరింత హింస పెరుగుతుందన్నారు. సామూహిక లైంగిదాడులు, హత్యలు వంటి దారుణాలను సహించవద్దన్నారు. సినిమాల్లో సిగరెట్ తాగడం హానికరమని ప్రకటనలు వస్తుంటాయని, దళితులపై దాడి, మహిళలపై హింస దేశానికి అనర్ధం అని ప్రకటనలు వచ్చి పౌర సమాజానికి సందేశం ఇవ్వాలన్నారు. మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశం లో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు లక్ష్మీదేవి, రాష్ట్రనాయకురాళ్లు చంద్రకళ, రేణుక, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు, నగర కార్యదర్శి కొమ్ము విజయ్ కుమార్, జనగామ జిల్లా అధ్యక్షులు తూటి దేవదానం తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Feb,2021 05:02PM