హైదరాబాద్ : దేశంలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా నేడు భారత్ బంద్ కు వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేరళ రాజధాని తిరువనంతపురంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి రోడ్డుపైకి లాక్కొచ్చారు. చమురు ధరలు తగ్గించడంలో అటు కేంద్రం విఫలమైందని విమర్శించారు. ఆ విషయాన్ని ఎత్తిచూపేందుకు ఆటోలను తాళ్లతో లాగామని వివరించారు. చమురు ధరల పెంపుతో ప్రజలను దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో వందలాది ఆటోలు పాల్గొన్నాయని థరూర్ వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm