హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 189 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,453కి చేరుకుంది. ఇప్పటి వరకు 1,632 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,94,911 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,910 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm