హైదరాబాద్: అఖిల భారత వ్యాపార సంస్థలు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా సీపీఐ(ఎం) పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. శుక్రవారం నగరంలోని ఎల్బీనగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల పేరిట ప్రజలపై, వ్యాపారులపై భారం వేస్తుందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలకు భారం వేసి ఇబ్బందులకి గురిచేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm