హైదరాబాద్ : ఓ కార్మిక నేత మహిళను లైంగిక వేధించిన ఘటన సంచలనంగా మారింది. కార్మిక సమస్యల కోసం పోరాటాలు చేయాల్సిన కార్మిక నేత బాధ్యతలు మరిచి కామాంధుడిగా మారాడు. వయసును కూడా పట్టించుకోకుండా కూతురు వయసున్న సహోద్యోగి భార్యపై కన్నేశాడు. పదేపదే ఆమెకు ఫోన్లు చేస్తూ కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ‘రాత్రి నా కలలోకి వచ్చావ్. మీ ఆయన లేనప్పుడు నా దగ్గరికి వచ్చేయ్’ అంటూ అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. అయితే ఆ కార్మిక నేత మహిళతో మాట్లాడిన ఆడియో పుటేజ్ లీక్ కావడంతో ఇప్పుడు కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఉపరితలగనిలో ఓ వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఇల్లెందులో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అదే కాలనీలో నివాసముంటున్న కార్మిక సంఘం నేత ఆ ఉద్యోగి భార్యపై కన్నేశాడు. ఆమెకు తరుచూ ఫోన్లు చేస్తూ కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. కొంతకాలంగా వేధింపులు భరిస్తూ వచ్చిన బాధితురాలు విసిగిపోయి ఆ కార్మిక నేత మాట్లాడిన కాల్‌ను రికార్డ్ చేసింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేయలేదు.
కార్మిక సంఘం నేతను స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు.. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. మరోసారి మహిళను వేధించబోమని అతడితో హామీపత్రం రాయించుకుని వదిలేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈలోగా కార్మిక నేత ఆ మహిళతో మాట్లాడిన ఆడియో పుటేజీ బయటకు లీక్ కావడంతో కలకలం రేగింది. ఆ కామాంధుడిపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Feb,2021 05:54PM