హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జాతీయ మీడియాలో కూడా ఈ ఘటన గురించి ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కుటుంబంలో అందరూ విద్యావంతులైనా మూఢనమ్మకాల వలలో వారు చిక్కుకుపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమయింది. తండ్రి పురుషోత్తమ నాయుడు, తల్లి పద్మజ కలిసి కుమార్తెలు అలేఖ్య, సాయి దివ్యలను అత్యంత క్రూరంగా చంపడం అందరినీ విస్మయపరిచేలా చేసిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ సంచలన నిజం బయటపడింది. ఈ జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. ప్రస్తుతం మానసిక నిపుణుల వద్ద చికిత్సలో ఉన్న పద్మజ, పురుషోత్తమనాయుడు ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. చిన్నకుమార్తె సాయి దివ్యను పద్మజ చంపలేదని డాక్టర్లు కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రిలో సైకియాట్రిక్ నిపుణుల ఆబ్సర్వేషన్ లో పద్మజ, పురుషోత్తమనాయుడు దంపతులు ఉన్నారు. ప్రతీరోజూ నిపుణులు వీళ్లతో మాట్లాడుతున్నారు. వారిని మాటల్లో పెట్టి అసలు ఆనాడు ఏం జరిగిందన్న వివరాలను రాబడుతున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి నుంచి రాబట్టిన వివరాలతో డాక్టర్లు ఓ దారుణ నిజాన్ని బయటపెట్టారు. చిన్నకుమార్తె సాయి దివ్యను పద్మజ చంపలేదని డాక్టర్ల విచారణలో వెల్లడయింది. పెద్ద కుమార్తె అలేఖ్యే ఆ దారుణానికి ఒడిగట్టిందని తేలింది. అలేఖ్యే తన సోదరి సాయి దివ్యను హతమార్చిందనీ, ఆ తర్వాత తనను కూడా చంపితే ఇద్దరం బతికొస్తామని చెప్పడంతోనే, అలేఖ్యను పద్మజ చంపిందని చెబుతున్నారు. ’పద్మజ, పురుషోత్తమనాయుడు దంపతులతో వేరు వేరుగా మాట్లాడుతున్నాము. వారు ఈ ఘటనతో పూర్తిగా షాక్ లో ఉండిపోయారు. పద్మజ కోలుకుంటోంది కానీ, పురుషోత్తమనాయుడు ఇంకా ఆ పరిస్థితి నుంచి బయటపడలేదు. వారితో మాట్లాడుతూ, ఆనాడు అసలేం జరిగిందన్న వివరాలను రాబడుతున్నాం.‘ అని విశాఖ మానసిక ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనలో తండ్రి పురుషోత్తంనాయుడు, పద్మజలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ-1గా పురుషోత్తం నాయుడు, ఏ-2గా పద్మజను చేర్చారు. వారి మానసిక పరిస్థితి బాగాలేకపోవడం, జైలులో కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో విశాఖ మానసిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తమై తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Feb,2021 08:30AM