హైదరాబాద్: జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఎర్దంది గ్రామంలో పాత కక్షలకు ఓ వ్యక్తి బలి అయ్యాడు. బర్లపాటి రాజేశ్వర్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో రాజేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm