హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త ఉద్యోగాలు రాలేదని, 50 వేల మంది ఉద్యోగులను తొలగించారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014కు ముందు కేసీఆర్ ఆస్తులెంత?.. ఇప్పుడెంత? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తీరు బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని జీవన్‌రెడ్డి ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm