హైదరాబాద్ : మన బడి నాడు – నేడుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు మార్చిన స్కూళ్ల ఫొటోలు పరిశీలించిన సీఎం.. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు భవనాల నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో సీబీఎస్‌ఈ విధానంపై సీఎం కీలక ప్రస్తావన చేశారు. 2021–22 విద్యా సంవత్సరంలో 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలని.. తర్వాత తరగతులకు ఒక్కో ఏడాదీ అమలు చేయాలని ఆదేశించారు. దీంతో 2024 విద్యా సంవత్సరానికల్లా సీబీఎస్‌ఈ విధానంలోకి 1 నుంచి 10 తరగతి వరకూ విద్యార్థులు వస్తారని ఆయన అన్నారు. ఇక అంగన్ వాడీ టీచర్లు.. చిన్నారులకు బోధన ఎలా చేయాలన్న దానిపై శిక్షణ.. అలాగే టీచర్లకు కూడా శిక్షణ కొనసాగాలని అన్నారు. ప్రతి రెండు నెలలకోసారి వారు ఎంతవరకు నేర్చుకున్నారన్న దానిపై ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని జగన్ పేర్కొన్నారు. పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా వారు ఎంతవరకు శిక్షణ కార్యక్రమాల ద్వారా అప్‌గ్రేడ్ అయ్యారో పరిశీలించి, మరింతగా వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆయన అన్నారు.
మార్చి నెలాఖరుకల్లా పలు స్కూళ్ల నిర్మాణాలు జరిగి ఉండాలని అన్నారు. స్కూళ్ళలో ఇంటీరియర్ కూడా బాగుండాలని, సెకండ్ ఫేజ్ నాడు-నేడులో మరింత మార్పులు చేయాలని జగన్ పేర్కొన్నారు. విద్యార్ధులకు ఏర్పాటుచేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలని అన్నారు. పనుల్లో ఎక్కడా నాణ్యతా లోపం రాకూడదన్న ఆయన నాణ్యతకు పెద్దపీట వేయాలని అన్నారు. పనుల్లో నాణ్యత లేకపోతే సీరియస్‌గా తీసుకోవాలన్న ఆయన ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థితి ఎక్కడా ఉండకూడదని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Feb,2021 08:44PM