ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్ కంటే ముందు @ysjagan వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారు.దిశ చట్టం అంటూ మాయ చేసారు.ఇప్పుడు గన్ను రావడం లేదు జగన్ కనపడటం లేదు.ఒక్క మహిళకు న్యాయం జరిగింది లేదు. కళ్ళ ముందే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా జగన్ రెడ్డి లో చలనం రావడం లేదు.(1/3) pic.twitter.com/nskKMD0pZP
— Lokesh Nara (@naralokesh) February 24, 2021
హైదరాబాద్ : గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష అనే విద్యార్థినిని ప్రేమ పేరుతో విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారని మండిపడ్డారు. దిశ చట్టం అంటూ మాయ చేశారని అన్నారు. ఇప్పుడు ఏమైనా జరిగితే గన్ను రావడం లేదు, జగన్ కనపడటం లేదని ఎద్దేవా చేశారు. ఒక మహిళకు కూడా న్యాయం జరిగిందిలేదని చెప్పారు. కళ్ల ముందే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా జగన్ లో చలనం రావడం లేదని దుయ్యబట్టారు. 'నరసరావుపేటలో ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని కోట అనూషను అత్యంత దారుణంగా హత్య చేశాడు మృగాడు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా పబ్లిసిటీ పిచ్చ నుండి బయటికి వచ్చి మహిళలకు రక్షణ కల్పించాలి. అనూషని హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి. అనూష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి' అని లోకేశ్ ట్వీట్ చేశారు.