హైదరాబాద్ : బీహార్లో పోలీసులకు, లిక్కర్ మాఫియాకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఓ సబ్ ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన ఓ వాచ్మెన్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్లోని సీతామఢి జిల్లా మజోర్గంజ్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు రెయిడ్కు వెళ్లిన సమయంలో లిక్కర్ మాఫియాకు చెందిన వ్యక్తులు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఓ స్మగ్లర్ సైతం మరణించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm