హైదరాబాద్: కరోనాపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి అదే తప్పు చేస్తున్నట్లు కనపడుతోంది. ఒకవైపు చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంటే.. సరిహద్దుల్లో అప్రమత్తం చేయకుండా అదే నిర్లక్ష్యన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది కరోనా మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఇలాగే అవగాహనా రాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి తెలంగాణ ప్రభుత్వం విమర్శలకు గురైంది. వందలాది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారంటూ ప్రజలు ప్రభుత్వాన్ని దోషిగా చూశారు. మళ్లీ ఇప్పుడు సయితం ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తోంది. మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఈ మూడు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm