అమరావతి: అనంతపురం జిల్లాలోని పెద్దపప్పూరు మండలం వరదపాయపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిన పడిన ఘటనలో తల్లీకొడుకు సజీవ దహనమయ్యారు. వెంకటస్వామి (37) తల్లి వెంకటలక్ష్మమ్మ (55)తో కలిసి కూలీ పని కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో మంటలు చెలరేగి తల్లీకొడుకులకు అంటుకొని అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. కూలీ పనులకు వెళ్తూ తల్లీకొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm