హైదరాబాద్ : ఢిల్లీలో ఈరోజు స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 9.17 గంటలకు పశ్చిమ ఢిల్లీలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. రిక్టర్‌స్కేలుపై దాని తీవ్రత 2.8గా నమోదయ్యిందని తెలిపింది. భూకంప కేంద్ర ఢిల్లీకి వాయవ్యంలో ఉందని ఎన్‌సీఎస్ అధికారులు ప్రకటించారు. భూ అంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని చెప్పారు. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm