హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కరెంట్ తీగలు తెగి కారుపై పడ్డాయి. దీంతో కారులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గోకవరం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm