హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 11,666 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. మరో 14,301 మంది డిశ్చార్జి అవగా.. వైరస్ ప్రభావంతో 123 మంది మృత్యువాతపడ్డారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,01,193కు పెరిగింది. ఇప్పటి వరకు 1,03,73,606 మంది కోలుకోగా.. 1,53,847 మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,73,740 ఉన్నాయని తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm