హైదరాబాద్ : మొసలిని చూస్తేనే మనం ఆమడ దూరం పరుగెత్తుతాం. నీటికి దగ్గరలో మొసలి ఉంటే ఆ పక్కకు వెళ్లేందుకు పెద్ద పెద్ద జంతువులే సాహసం చేయవు. అలాంటిది ఓ వ్యక్తి నీటి పక్కనే పడుకుని ఉన్న ఓ మొసలితో.. ముచ్చటించాడు. మొసలితో ఓ వ్యక్తి కబుర్లు చెబుతూ.. మొసలిని తాకూతూ వింతగా ప్రవర్తించాడు. పక్కనే ఉన్న వారు అతడిని ఎంత వారిస్తున్నా అదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసేసారు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm