హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వేలేరుపాడులోని శ్రీనివాస నర్సింగ్ హోమ్‌లో ప్రసవానికి వచ్చిన గిరిజన గర్భిణికి వైద్యం వికటించి మృతి చెందింది. వివరాల ప్రకారం.. మల్లారం గ్రామానికి చెందిన మడకం నాగమణి(32)కి ఆస్పత్రిలో సిజేరియన్ చేయడంతో మరణించింది. విషయం తెలిసిన అడిషనల్ డీఎంహెచ్ఓ మురళీకృష్ణ ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నారు. ఆర్‌ఎంపీ ఆసుపత్రిని సీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm