హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు రోజుకు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని సోమ్‌వర్‌పేట తాలూక పరిధిలోని ఓ కళాశాలలో 25 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్‌గా తేలింది. గారాగండురులోని మొరార్జీ దేశాయ్ పీయూ కళాశాలలో ఈ నెల 11 నుంచి ఆఫ్‌లైన్‌లో తరగరతులు నిర్వహిస్తున్నారు. సుమారు 76 మంది విద్యార్థులకు తరగతులకు హాజరవుతున్నారు. వీరందరికీ ఇంతకు ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ వచ్చింది. అయితే ఈ నెల 21న తరగతులకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఒకరికి జ్వరం వచ్చింది. దీంతో ఆ విద్యార్థి కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కాలేజీ యాజమాన్యం సూచించింది. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించాడు. ముందస్తుగా మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు చేయించగా.. 25 మంది మహమ్మారి బారినపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు. దీంతో అధికారులు కళాశాలను 14 రోజుల పాటు మూసివేశారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు ధ్రువీకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm