హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినా, మరింత కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది. ఇందులో భాగంగానే లాక్ డౌన్ ఆంక్షలను మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వ తేదీ వరకు ఆంక్షలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, గతంలో 50శాతం సీటింగ్ కు అనుమతులు ఉంటె పరిస్థితులను బట్టి సీటింగ్ సామర్ధ్యం పెంచుకునే వెసులుబాటును కల్పించింది. అదే విధంగా కేవలం క్రీడాకారులు కాకుండా మాములు ప్రజలు కూడా స్విమ్మింగ్ పూల్స్ కు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చింది. ఇక కంటైన్మెంట్ జోన్లకు వెలుపల అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటి వరకు కేవలం బిజినెస్ తరహాలోనే సినిమా హాళ్లకు అనుమతులు ఉన్నాయి. అయితే, ఇప్పుడు బిజినెస్ తరహాలోనే కాకుండా ఎగ్జిబిషన్ హాళ్లు కూడా తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు. అంతేకాదు, సభలు, సమావేశాలకు సంబంధించి పరిమితిని కూడా కేంద్రం తాజా మార్గదర్శకాల్లో పెంచింది.
Mon Jan 19, 2015 06:51 pm