హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నెల 31 లోపు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం బిఆర్‌కేఆర్ భవన్‌లో ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో శాఖల వారీగా జరుగుతున్న పదోన్నతులను సీఎస్ సమీక్షించారు. ప్రమోషన్ల విషయం అత్యంత ప్రాధాన్యత గల అంశమన్నారు. ఎక్కువ మంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. తదనుగుణంగా వివిధ కేటగిరీలలో ఏర్పడిన పదోన్నతుల ఖాళీలను భర్తీ చేయుటలో ఎదురవుతున్న సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పదోన్నతులపై శాఖాధికారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm