హైదరాబాద్ : సినీమా అభిమానులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సినిమా థియేటర్లలో 50 శాతానికే పరిమితమైన సీటింగ్ సామర్థ్యాన్ని పెంచింది. థియేటర్లలో అధిక శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వవచ్చని తాజా నిబంధనల్లో పేర్కొంది. ఇది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మాధ్యమాల మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. అయితే ఎంత మేరకు సీట్లను బుక్ చేసుకోవచ్చన్న వివరాలను కేంద్రం త్వరలోనే వెల్లడించనుంది.
Mon Jan 19, 2015 06:51 pm