హైదరాబాద్ : ఐసీసీ తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ 1, సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచారు. బౌలర్ల జాబితాలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో ఉండగా.. ఆల్రౌండర్లలో రవీంద్ర జడేజా, హర్దిక్ పాండ్య టాప్-20లో ఉన్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ 837 మూడో స్థానానికి పరిమితమయ్యాడు. రాస్ టేలర్(818), ఆరోన్ ఫించ్(791) టాప్-5లో ఉన్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(722) అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో అఫ్గాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్(701), మూడో స్థానంలో భారత పేసర్ బుమ్రా(700) కొనసాగుతున్నారు. విండీస్తో సిరీస్లో విజయవంతమైన బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహిదీ హసన్ తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ నాలుగో స్థానంలో నిలిచాడు. 19వ స్థానంలో ఉన్న బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ 8వ స్థానం పొందాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2021 08:16PM