హైదరాబాద్ : జమ్ముకాశ్మీర్లోని అనంతనాగ్లో జిల్లాలో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడిలో ఓ సైనికుడు అమరుడయ్యాడు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయని భారత సైన్యం అధికారి ఒకరు వెల్లడించారు. భద్రతా దళాలే లక్ష్యంగా అనంత్నాగ్ జిల్లాలోని షాంసిపొర ప్రాంతంలో ముష్కరులు ఈ గ్రెనేడ్ దాడికి పాల్పడినట్లు ఆ అధికారి తెలిపారు. గాయపడిన జవాన్లను 92 బేస్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm