హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్లలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. స్థానికులు పసికందు మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పసికందును ఎవరు పడేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm