హైదరాబాద్ : మలయాళ దర్శకుడు, నటుడు మధుపాల్ పెద్ద కూతురు, టీవీ యాంకర్ మాధవి పెళ్లి ఘనంగా జరిగింది. కేరళలోని వాజుత్తకోడ్‌కు చెందిన అరవింద్‌తో ఆమె ఏడడుగులు వేసింది. శాంతిగిరి ఆశ్రంలో ఈ వివాహ కార్యక్రమం జరగ్గా ఈ విషయాన్ని పెళ్లి కూతురి చెల్లి మీనాక్షి సోమవారం సోషల్ మీడియాలో వెల్లడించింది. 'ప్రపంచంలోనే నువ్వు బెస్ట్ అక్కవి. నువ్వు పెళ్లి బంధంలో అడుగు పెట్టినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు వేరే ఇంట్లోకి అడుగు పెడుతున్నా మేమంతా నీ వెన్నంటే ఉంటాం. కానీ నిన్ను ఎంత మిస్ అవుతానో చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటే అది తలుచుకుంటేనే కన్నీళ్లు జలధారలా కారడం ఖాయం. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సిస్టర్, బెస్ట్ డాటర్.. ఇలా అన్నీ ఉన్న నువ్వు దొరకడం నా అదృష్టం. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను' అని ఎమోషనల్ అవుతూ వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm