హైదరాబాద్ : ఢీల్లీలో నిన్న జరిగిన రైతుల లక్ష ట్రాక్టర్ల పరేడ్ బాగా జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మోడీ ప్రభుత్వం శాంతి ర్యాలీని చూసి తట్టుకోలేక కుట్ర పన్ని వారి మద్దతు దారులచే ఎర్రకోటపై హడావుడి చేశారని చెప్పారు. ఈ పరిణామాలతో భవిష్యత్‌లో రైతు ఉద్యమంపై మరింత దాడి చేయడానికి పూనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలు తీసుకు వచ్చారు, నిన్నటి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకమని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడంపై రైతాంగం ఆలోచించాలని చెప్పారు. రైతాంగ సమస్యలపై ఫిబ్రవరిలో అందరూ కలిసి వస్తే 33 జిల్లాల్లో గ్రామగ్రామాన యాత్ర నిర్వహిస్తాం, త్వరలోనే తేదీలను ప్రకటిస్తామన్నారు. ప్రజా సమస్యలతో ముడిపడి ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రస్తుతం కీలకంగా భావిస్తున్నామని చెప్పారు. వామపక్షాల అభ్యర్థి జయసారధిని గెలిపిస్తారని నమ్మకం ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm